Chilkur Balaji Temple : చిలుకూరు బాలాజీ పరిసరాల్లో ఫుల్ రష్.. ఎందుకో తెలుసా..?

Update: 2024-04-19 06:30 GMT

వీసా దేవుడిగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆలయం హైదరాబాద్ శివారులోని చిలుకూరు బాలాజీ ఆలయం. ఇక్కడ దర్శించుకుని 11 రౌండ్లు వేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని లక్షలాది మంది భక్తులు నమ్ముతుంటారు. ఆ తర్వాత 108 రౌండ్లు గుడి చుట్టూ వేస్తుంటారు.

ఏప్రిల్ 19 శుక్రవారు ఉదయం నుంచే చిలుకూరు బాలాజీ ఆలయానికి భక్తులు బారులు తీరారు. కాలీ మందిర్ తర్వాత టీఎస్ పీఏ జంక్షన్, ఔటర్ రింగ్ రోడ్డు, మొయినాబాద్ నుంచి చిలుకూరు బాలాజీ ఆలయం రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆలయానికి వెళ్లే దారులు ఇరుకుగా ఉండటం.. గుడిలో జనం విపరీతంగా చేరిపోవడంతో.. కిలోమీటర్ల మేర నిలిచిపోయింది.

పొద్దున ఐదు గంటల నుంచి చిలుకూరు బాలాజీ ఆలయానికి బారులు తీరారు భక్తులు. సంతానం లేని వారి కోసం ప్రత్యేక తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నామని చిలుకూరు బాలాజీ ప్రధాన ఆలయ పూజారి సౌందర రాజన్ ప్రకటించడంతో భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఇవాళ్టి నుంచి చిలుకూరు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. గరుడ దేవుడికి ప్రసాదం పెట్టి పంపిణీ చేస్తారు. ఈ ప్రసాదం స్వీకరిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే.. హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల నుంచి భారీగా చేరుకుంటున్నారు భక్తులు. దీంతో.. ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.

Tags:    

Similar News