TTD : తిరుమలలో భక్తుల రద్దీ .. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు

Update: 2025-06-28 09:45 GMT

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తారు. దీంతో కంపార్ట్మెంట్లు నిండి, బయట ఎన్‌జీ షెడ్స్ వరకు భక్తులు వేచిఉన్నారు. ఈ క్రమంలో సర్వదర్శనానికి 20 గంటలు పడుతోండగా, రూ.300 ప్రత్యేక దర్శన టికెట్టు తీసుకున్న భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. కాగా శుక్రవారం శ్రీవారిని 68,229 మంది భక్తులు దర్శించుకోగా, 30,559 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

కాగా తిరుమల శ్రీవారిని శనివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కర్ణాటక మంత్రి హెచ్.కె. పాటిల్.,సినీ నటుడు సమీర్ హసన్ లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా…ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు..

Tags:    

Similar News