AP Home Ministe : తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత.
ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న హోం మంత్రికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకున్న అనంతరం... శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు మంత్రి అనిత. దర్శనం తరువాత పండితులు వేద ఆశీర్వచనం అందించగా ..ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మీడియాతో మాట్లాడుతూ.. కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని.. సీఎం చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లుగా చెప్పారు. అంతకుముందు తిరుచానూరు టీడీపీ నేతలు వంగలపూడి అనితను ఘనంగా సత్కరించారు. కాగా పలువురు ఆలయ అధికారులు, స్థానిక నేతలతో పాటు పోలీస్ అధికారులు మంత్రి వెంట ఉన్నారు.