తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేనివారికి శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 84,198 మంది దర్శించుకోగా, 25,665 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.94 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది. తిరుమలలో ఈ నెల 25, 30 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. 25న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 30న ఉగాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. దీంతో 24, 29వ తేదీల్లో సిఫారసు లేఖలు అనుమతించబోమని తెలిపింది. మరోవైపు తెలంగాణ ప్రజాప్రతినిధులు లేఖలను 23వ తేదీ స్వీకరించి 24న దర్శనానికి అనుమతించబోమని స్పష్టం చేసింది.