Maha Shivaratri : శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎప్పుడంటే?

Update: 2025-01-18 09:00 GMT

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1 వరకు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 26న శివరాత్రి సందర్భంగా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఈవో శ్రీనివాసరావు ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, ట్రాఫిక్, పార్కింగ్ వంటివాటిపై దృష్టి పెట్టాలని సూచించారు.

ఈవో శ్రీనివాసరావు సమీక్షలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు 19న ప్రారంభమయ్యే ముందు నుండే భక్తుల రాక మొదలవుతుందని చెప్పారు. అందువల్ల ఏర్పాట్లన్నింటినీ వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే ప్రభోత్సవం, బ్రహ్మోత్సవ కళ్యాణం, రథోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో సాంప్రదాయ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయి. మహాదేవుని కృప కోసం భక్తులు ప్రత్యేక అభిషేకాలు, హోమాలు, జపాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల ముఖ్య ఆకర్షణలలో రథోత్సవం, కల్యాణోత్సవం, లింగోద్భవ దర్శనం ప్రధానమైనవి. భక్తుల ఆధ్యాత్మిక సంతృప్తి కోసం ప్రత్యేక ధ్యాన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయనున్నారు.

Tags:    

Similar News