శ్రీశైలం మహాక్షేత్రంలో వైభవంగా సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ఉత్సవాల్లోమూడో రోజు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు.;
శ్రీశైలం మహాక్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లోమూడో రోజు శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి రావణ వాహనాదీశులై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో అర్చకులు, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో మిరిమిట్లు గొలుపుతూ భక్తులను ఆకట్టుకుంది. భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో రావణ వాహనంలో ఆవహింపజేశారు. అర్చక స్వాములు వాహన పూజలు నిర్వహించి ప్రత్యేక హారతులిచ్చారు.
అర్చకస్వాములకు ప్రత్యేక పూజల అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తుల్ని విద్యుత్ దీప కాంతుల నడుమ కన్నులపండువగా ఆలయ ప్రదక్షిణలు గావించారు. ప్రధాన ఆలయ రాజగోపురం నుంచి రావణ వాహనాదీశులైన స్వామిఅమ్మవార్లు వైభవంగా శ్రీశైలం ఆలయ మాడవీధుల్లో విహారించేందుకు బయలుదేరారు.
రావణ వాహానంపై స్వామిఅమ్మవార్లు విహారిస్తుండగా భక్తులు అధికసంఖ్యలో పాల్గొని కర్పూర నీరాజనాలర్పించారు. ఉత్సవమూర్తుల ముందు కళాకారుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి.