YV Subbareddy : లడ్డూ కాదు విషం.. వైవీ సుబ్బారెడ్డి వైపే అందరి చూపు..

Update: 2025-11-13 06:00 GMT

తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో సంచలనాలు బయటకు వస్తున్నాయి. మొన్నటి దాకా అందరూ నెయ్యి కల్తీ చేశారు అని అనుకున్నారు. కానీ అజయ్ సుగంధ్ విచారణలో దిమ్మతిరిగే విషయాలు బయటకు వచ్చాయి. అసలు నెయ్యి లేకుండానే కెమికల్ వాడారని తేలింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడే లడ్డూ కోసం ఒక్క చుక్క నెయ్యి వాడకుండా భోళేబాబా డెయిరీ నుంచి ఈ కెమికల్ ను తీసుకొచ్చారు. అజయ్ సుగంధ్ చెప్పింది ఒక కెమికల్ మాత్రమే వాడామని. దాన్ని మలేషియా నుంచి తీసుకొచ్చామన్నారు. పెయింట్స్, షాంపూల వాడకంలో దాన్ని వాడుతారు. అంటే శ్రీవారి భక్తులు తిన్నది లడ్డూలు కాదు.. విషం.

అంటే టీటీడీ భక్తులు అంటే ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారు అంటే కూడా భయం లేకుండా ఇంతటి పాపాలు చేస్తారా అంటున్నారు హిందూ భక్తులు. హిందూ భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ విషయంలో ఇంతటి దారుణాలు చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇక అప్పటి ఈవో ధర్మారెడ్డిని విచారిస్తే.. అంతా వైవీ సుబ్బారెడ్డిదే అని తెలిసింది. హై కమాండ్ చెప్పినట్టే తాను చేశానని చెప్పాడు ధర్మారెడ్డి. ఆ హైకమాండ్ ఇంకెవరు అయి ఉంటారు.

అందరి చూపు ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి వైపే ఉంది. ఆయన హయాంలోనే ఇదంతా జరిగింది. ఆయన కను సన్నల్లోనే ఇంతటి దారుణాలు చేశారు. ఆయనకు ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. భక్తులు తిన్న లడ్డూలో నెయ్యికి బదులు కెమికల్ ను కలిపారు.. అంటే భక్తుల ఆరోగ్యం ఎంత దారుణంగా దెబ్బతిని ఉంటుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే కదా ఇది. ప్రసాదాన్ని అపవిత్రం చేశారు. భక్తుల నమ్మకాన్ని దెబ్బ తీశారు. ఒక రకంగా మత విశ్వాసాల మీద దాడి చేశారు. భోళే బాబా ఈ నెయ్యి తయారీ కోసం ఒక్క చుక్క పాలు వాడలేదు. నకిలీ రైతుల పేరుతో పాలను సేకరించినట్టు రికార్డుల్లో రాశారు. అంతే గానీ ఒక్క రైతు నుంచి పాలు తీసుకోలేదు. నెయ్యి మొత్తం కెమికల్ తోనే రెడీ చేయించారు. ఇంతటి దారుణాలు చేసిన వైవీ సుబ్బారెడ్డి ఏం చెబుతారో చూడాలి.


Full View

Tags:    

Similar News