Puri Ratna Bhandar : రేపు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం రహస్య గది

Update: 2024-07-17 06:32 GMT

ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదిని రేపు తెరవనున్నారు. ఇందుకోసం ఉ.9:51 నుంచి మ.12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈనెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లోని సంపదను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్‌కు తరలించి, వీడియోగ్రఫీ చేయించినట్లు అధికారులు తెలిపారు. రేపు రహస్య గదిలోని సంపదను మరో స్ట్రాంగ్‌రూమ్‌కు తరలిస్తారు. అనంతరం భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు.

శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షు డు జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ నేతృత్వంలో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు.

సమావేశం అనంతరం జస్టిస్‌ రథ్, ఆలయ పాలనాధికారి అరవింద పాఢి విలేకరులతో మాట్లాడుతూ ‘ఈ నెల 14న భాండాగారంలోని తొలి రెండు గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపద బయటకు తీసి తాత్కాలిక స్ట్రాంగ్‌రూంకు తరలించ మన్నారు..

ఇదంతా వీడియోగ్రఫీ చేయించాం. ఈనెల 18న రహస్య గదిని తెరిచి, అందులోని సంపదను మరో తాత్కాలిక స్ట్రాంగ్‌రూంలో భద్రపరుస్తాం. అనంతరం ఈ భాండాగారాన్ని పురావ స్తు శాఖకు మరమ్మతుల నిమిత్తం అప్పగిస్తామ న్నారు.

పనులు పూర్తయ్యాక సంప దనంతా మళ్లీ రహస్య గదికి తెచ్చి, ఆభరణాల లెక్కింపు చేపడతామ’ని వెల్లడించా రు.రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీక్షేత్రంలోకి గురువారం ఉదయం నుంచి భక్తుల ప్రవేశాన్ని నిలిపి వేసినట్లు ఆలయ పాలక మండలి ప్రకటించింది..

Tags:    

Similar News