Srisailam : ఆన్‌లైన్‌లో శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లు

Update: 2025-07-05 06:45 GMT

భక్తులకు శ్రీశైల ఆలయ ఈవో గుడ్ న్యూస్ చెప్పారు. సామాన్య భక్తుల కోసం ఆన్‌లైన్‌లో మల్లికార్జున స్వామి ‘ఉచిత స్పర్శ దర్శనం’ టోకెన్లను అందుబాటులో ఉంచుతామన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి పునఃప్రారంభమైన ఉచిత స్పర్శ దర్శనానికి భక్తుల నుంచి అద్భుత స్పందన వచ్చిందని చెప్పారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం ఉంటుందన్నారు. వచ్చేవారం నుంచి ఆన్‌లైన్‌లో టోకెన్లు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

కాగా భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో వారికి అసౌకర్యం కలగకుండా ఆన్ లైన్‌లో పారదర్శకంగా టోకెన్లు జారీ చేస్తామని ఈవో చెప్పారు. www.srisailadevasthanam.org, www.aptemples.ap.gov.in వెబ్‌సైట్‌ల ద్వారా ఉచిత స్పర్శ దర్శనం టోకెన్లను పొందాల్సి ఉంటుందన్నారు. భక్తులు తమ పేరు, చిరునామా, ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని తెలిపారు. ఒక రోజు ముందుగానే ఆన్‌లైన్‌ ద్వారా టోకెన్లు పొందవచ్చని.. టోకెన్లను దుర్వినియోగం చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News