Lord Shiva : పరమ శివుడు యోగి ఎలా అయ్యాడు..?

Update: 2024-03-08 07:34 GMT

ప్రతీ చాంద్రమాన మాసం లోని 14వ రోజు లేదా అమావాస్యకు ముందు రోజుని శివరాత్రి అంటారు. పంచాంగ సంవత్సరంలో వచ్చే పన్నెండు శివరాత్రులలో ఫిబ్రవరి - మార్చ్ లలో వచ్చేదానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ఈ రాత్రి, భూమి ఉత్తర అర్థగోళం ఎటువంటి స్థితిలో ఉంటుందంటే, మనిషిలోని శక్తి సహజంగానే ఉప్పొంగుతుంది. ఈ రోజున ప్రకృతి మిమల్ని ఆధ్యాత్మిక శిఖరానికి నెడుతుంది. దీనిని ఉపయోగించుకోవడానికే, ఈ సంస్కృతిలో రాత్రంతా జరిపే ఈ పండుగను నెలకొల్పారు. మనం తెల్లవార్లూ జాగారం చేసి మన వెన్నెముకను నిటారుగా ఉంచడం ద్వారా ఇలా శక్తులు సహజంగా పైకి ఎగసి పడడానికి సహకరించవచ్చు.

యోగ శాస్త్రానికి మూలకారకుడైన ఆదియోగి లేదా ఆదిగురువుగా చూస్తారు. ధ్యానంలో ఎన్నో వేల సంవత్సరాలు ఉన్న తరువాత ఒకరోజు ఆయన పూర్తిగా నిశ్చలుడయ్యాడు. ఆ రోజే మహాశివరాత్రి. ఆయనలోని అన్ని కదలికలు ఆగిపోయి సంపూర్ణంగా నిశ్చలుడయ్యాడు. అందుకనే మహాశివరాత్రిని సన్యాసులు నిశ్చలత్వానికి ప్రతీకమైన రాత్రిగా చూస్తారు.

ఈ రోజు ఇంకా రాత్రికి యోగ సాంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక సాధన ఉంది. "యోగి" అనే పదానికి అర్థం ఈ ఉనికి యొక్క ఏకత్వాన్ని గ్రహించినవాడని. నేను "యోగ" అన్నప్పుడు, దానర్థం ఒక అభ్యాసమో లేక పద్ధతి గురించో కాదు. అవ్యవస్థలో ఉన్న ఏకత్వం గురించి తెలుసుకోవాలని ఉన్న కోరికలు, ఈ ఉనికిలో ఉన్న ఏకత్వాన్ని గురుంచి తెలుసుకోవాలనే వాంఛనే యోగ అంటాం. దీనిని అనుభవపూర్వకంగా అనుభవించడానికి మహాశివరాత్రి ఓ అవకాశాన్ని అందిస్తుంది. జాగారం చేసేటప్పుడు ఈ అంశాలు గుర్తుంచుకోండి.

Tags:    

Similar News