TTD : నేటి నుంచి తిరుమల సేవా టికెట్లు విడుదల

Update: 2024-06-18 04:55 GMT

బర్ నెలకు సంబంధించిన టికెట్లను టీటీడీ ( TTD ) నేటి నుంచి విడుదల చేయబోతోంది. సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల టికెట్లను ఎలక్ట్రానిక్ డిప్ ద్వారా కేటాయించనున్నది. ఇందుకు ఈ నెల 18న ఉదయం 10 గంటల నుంచి 20న ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుంది.

* ఆర్జిత సేవా టికెట్లకు ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్: ఈ నెల 18 ఉ.10 నుంచి 20వ తేదీ ఉ.10 వరకు

*కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవా టికెట్లు: ఈ నెల 21న ఉ.10 గంటలకు విడుదల

*అంగప్రదక్షిణం టికెట్లు: ఈ నెల 22న ఉ.10 గంటలకు

*రూ.300 స్పెషల్ ఎంట్రీ: ఈ నెల 24న ఉ.10 గంటలకు

*వసతి గదుల కోటా: ఈ నెల 24 మ.3 గంటలకు

మరోవైపు తిరుమల శ్రీవారి కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను జూన్ 21వ తేదీ విడుదల చేస్తారు. జూన్ 21వ తేదీ ఉదయం పదిగంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో ఈ టికెట్లు విడుదల చేస్తుంది. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన సెప్టెంబర్ నెల కోటాను జూన్ 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మరోవైపు సెప్టెంబర్ నెల అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.

Tags:    

Similar News