Yadadri Temple : యాదాద్రి ఆలయంలో ఆ పనిచేస్తే ఫైన్ కట్టాల్సిందే!

Update: 2024-05-18 06:29 GMT

స్వయంభూ లక్ష్మీ నృసింహుడు కొలువైన యాదాద్రి ఆలయాన్ని తెలంగాణ తిరుపతిగా చెబుతుంటారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే పర్యావరణాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి ఆలయం అడుగుజాడల్లో నడిచేందుకు యాదాద్రి ఆలయం సిద్ధమైంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్‌పై నిషేధం విధించింది.

ఆలయ పరిసరాల్లో ఈ నిషేధం అమలులో ఉంటుందని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎ.భాస్కరరావు శుక్రవారం దేవస్థానంలోని వివిధ విభాగాలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్‌ వాటర్‌ బాటిల్స్‌, ప్లాస్టిక్‌ వస్తువులు, ప్లాస్టిక్‌ కవర్లు మొదలు వాటి స్థానముల్లో ప్లాస్టికేతర వస్తువులను, బాటిల్స్‌, కవర్స్‌ను మాత్రమే వాడాలని పేర్కొంది.

ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని ఆదేశించింది. దేవస్థానంలోని అన్ని విభాగాల్లో ప్లాస్టిక్‌ వినియోగం జరగకుండా తప్పనిసరిగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత విభాగముల అధికారులను, సిబ్బందిని ఈవో ఆదేశించారు. లేకపోతే భక్తులకు ఫైన్ విధించనున్నారు.

Tags:    

Similar News