Dharma Reddy : ఎవరా హై కమాండ్.. ధర్మారెడ్డి విచారణలో సంచలనం

Update: 2025-11-13 05:15 GMT

టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. వైసిపి హయాంలో ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డిని మంగళవారం సిట్ విచారణకు పిలిచింది. ఈ విచారణలో ఆయన సంచలన విషయాలను బయటపెట్టారు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో అప్పటి ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి పాత్ర కూడా ఉందనే కోణంలో సిట్ విచారణ చేసింది. నెయ్యి కల్తీ జరిగిన సరి ఎందుకు చర్యలు తీసుకోలేదని కోణంలో అధికారులు ప్రశ్నించారు. ఈవో గా ఉన్న ధర్మారెడ్డికి అన్ని విషయాలు తెలిసినా సరే ఎందుకు మౌనంగా ఉన్నారని అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే తనకు ఎలాంటి సంబంధం లేదని.. అంతా హై కామెంట్ చెప్పినట్టే చేశానని ధర్మారెడ్డి సిట్ ముందు ఒప్పేసుకున్నాడు.

దీంతో ఎవరో హైకమాండ్ అనే కోణంలో అధికారులు నేడు ఆయన్ను మరోసారి విచారణకు పిలిచారు. ఎందుకంటే ఆయన ఈవోగా ఉన్న సమయంలోనే వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఈ కల్తీ నెయ్యి కేసులో సుబ్బారెడ్డి పాత్ర ఉందనేది సిట్ అధికారులు మొదటి నుంచి అనుమానిస్తున్నారు. వై వి సుబ్బారెడ్డి పిఎ అప్పన్న ఈ కల్తీ నెయ్యి కేసులో కీలకంగా వ్యవహరించారు. తక్కువ ధరకు నెయ్యి తీసుకురావాలనే ఉద్దేశంతో.. ఢిల్లీలో ఉన్న సుగంధి ఆయిల్ అండ్ కెమికల్స్ కంపెనీ నుంచి.. ఈ నెయ్యిని తీసుకొచ్చారు. వాస్తవానికి ఇది నెయ్యి కూడా కాదు. షాంపూలు, పెయింట్ కోసం వాడే కెమికల్స్ తో తయారుచేసిన ఒక పదార్థం. ఇది చూడటానికి నెయ్యి లాగా ఉంటుంది కానీ నెయ్యి కాదు. పాలు వెన్న లేకుండానే దీన్ని తయారు చేశారు. 2019 నుంచి 24 మధ్యలో అప్పన్న ఆస్తులు భారీగా పెరిగాయి. ఆయన అకౌంట్ లో ఏకంగా 4.69 కోట్లు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు.

ఆ సమయంలోనే టీటీడీ ఈవో గా ధర్మారెడ్డి ఉన్నారు. ధర్మారెడ్డి, అప్పన్న, సుబ్బారెడ్డి హయాంలోనే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం బయటపడినా సరే.. ఎలాంటి చర్యలు తీసుకోకుండా కొనసాగించారు. ఇప్పుడు ధర్మారెడ్డి చెప్పే సమాధానాలను బట్టి వైవి సుబ్బారెడ్డి పాత్ర మీద సిట్ అధికారులకు ఒక క్లారిటీ వస్తుంది. ఈనెల 14న వైవి సుబ్బారెడ్డిని సెట్ అధికారులు విచారణకు పిలిచారు. కాబట్టి ధర్మారెడ్డి చెప్పే సమాధానాలను బేస్ చేసుకుని వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించబోతున్నారు. మొత్తంగా చూస్తే ఆ హై కమాండ్ ఎవరు అనేది త్వరలోనే తేలిపోయే అవకాశం ఉంది.


Full View

Tags:    

Similar News