India-Pak War : ఇండియా, పాక్ వార్ : ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్

Update: 2025-05-10 14:15 GMT

ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత సైన్యం ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ను ఎదుర్కోనేందుకు పాకిస్తాన్ సైనిక చర్యకు ఉపక్రమించిన విషయం తెలిందే. ఇవాళ తెల్ల వారుజామున సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ పై పూర్తి స్థాయి మిలటరీ ఆపరేషన్ చే పడుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ తెల్లవారుజామున ఆ దేశ డైరెక్టర్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము చేపట్టిన సైనిక చర్యకు ‘ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్' అని పేరు పెట్టినట్లు ప్రకటించారు.

ఏమిటీ 'ఆపరేషన్ బన్యన్ ఉల్ మర్సూస్' ఈ వచనాన్ని ఖురాన్ నుంచి తీసుకున్నట్లు తె లుస్తోంది. బన్యాన్ మార్సూస్ అనేది అరబిక్ పదబంధం. చేధించలేని దృఢమైన గోడ అని అర్థం. 'నిజంగా అల్లాహ్ తన మార్గంలో యుద్ధ శ్రేణిలో పోరాడేవారిని ప్రేమిస్తాడు. వారు దృఢమైన నిర్మాణంలా ఉంటారు' అనే అర్థం వచ్చేలా ఈ పేరు పెట్టినట్లు అంతర్జా తీయ మీడియాలో కథనాలు వచ్చాయి. ఆ పేరుతో పాకిస్తాన్ తనను తాను ఒక లక్ష్యం కోసం పోరాడుతున్న శత్రు దుర్భేద్యమైన గోడగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తోంది.

Tags:    

Similar News