Pawan Kalyan Son : పవన్ కొడుక్కి గాయం.. హుటాహుటిన సింగపూర్ ప్రయాణం

Update: 2025-04-08 09:00 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సింగపూర్ వెళుతున్నారు. సింగపూర్ స్కూల్ లో జరిగిన ప్రమాదంలో తన చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. విషయం తెలిసిన పవన్ కల్యాణ్ తన మన్యం పర్యటనను రద్దు చేసుకుని సింగపూర్ వెళుతున్నారు. మార్క్ శంకర్ చికిత్స పొందుతున్న హాస్పిటల్ కు వెళ్లనున్నారు. పవన్ సింగపూర్ వెళ్లేందుకు వీలుగా విశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు.

పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో చదువుతున్నాడు. అతను చదువుతున్న స్కూల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లిపోవడంతో ఇబ్బందులకు గురైన మార్క్ శంకర్ ను స్కూల్ యాజమాన్యం హాస్పిటల్ లో చేర్చింది. పవన్ భార్య అన్నా లెజినోవా అక్కడే ఉండి కుమారుడికి చికిత్స అందిస్తున్నారు. 

Tags:    

Similar News