Gavaskar : 78వేల ఏళ్లైనా ఉగ్రవాదులు ఏం సాధించలేరు: గవాస్కర్

Update: 2025-04-25 10:00 GMT

పహల్గామ్ ఉగ్రదాడిపై మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషించేవారిని ఒకటే అడుగుతున్నా. గడచిన 78 ఏళ్లుగా మీ పోరాటం ఏం సాధించింది? ఒక్క మిల్లీమీటర్ భూమైనా దక్కిందా? ఇంకో 78వేల ఏళ్లైనా మీరు సాధించేదేమీ లేదు. ఏమీ మారదు. మరి ఎందుకీ హింస? చక్కగా శాంతియుతంగా జీవిద్దాం’ అని సూచించారు. స్టార్ స్పోర్ట్స్‌లో మాట్లాడుతూ ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. పెహ‌ల్గామ్ ఉగ్ర‌వాద దాడిలో 26 మంది ప‌ర్యాట‌కులు మృతిచెందారు. దాడి నేప‌థ్యంలో భార‌త ప్ర‌భుత్వం క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్న‌ది. సింధూ జ‌లాల ఒప్పందాన్ని ర‌ద్దు చేసింది. దీన్ని పాకిస్థాన్ సిరీయ‌స్‌గా తీసుకుని.. దౌత్య సంబంధాల‌ను బ్రేక్ చేసింది.

Tags:    

Similar News