Beauty Benefits : ముఖ సౌందర్యానికి పసుపు ప్యాక్

Update: 2024-07-03 07:38 GMT

కస్తూరి పసుపుని ఫేస్ ప్యాక్ గా వాడితే చాలా మంచిది. దీని వల్ల ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు దూరమవుతాయి. కస్తూరి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు దూరమై మృదువుగా మారుతుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న కస్తూరి పసుపు చర్మ ఇన్ఫెక్షన్స్, సమస్యల్ని దూరం చేస్తాయి. చర్మ రంగుని మెరుగుపరుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కొంతమంది ఆడవారికి అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని దూరం చేసేందుకు కస్తూరి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కస్తూరి పసుపులో శనగపిండి, పాలు కలిపి ప్యాక్ చేసి ముఖానికి అప్లై చేస్తే ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. కస్తూరి పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్ని దూరం చేస్తాయి. దీంతో చర్మంపై ముడతలు, ఫైన్ న్స్ దూరమవుతాయి. డార్క్ స్పాట్స్ కూడా దూరమై యవ్వనంగా కనిపిస్తారు.

ముఖం కాంతివంతంగా మెరవాలని కోరుకునేవారు కస్తూరి పసుపుని వాడితే గ్లో పెరుగుతుంది. డార్క్ స్కిన్ ప్రాబ్లమ్ దూరమవుతుంది. కాబట్టి, రెగ్యులర్ వాడండి. దీనిని వాడడం వల్ల పొల్యూషన్ వల్ల కలిగే స్కిన్ డ్యామేజీని కూడా దూరం చేసుకోవచ్చు. కస్తూరి పసుపులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ దూరమవుతాయి.

Tags:    

Similar News