Garlic : గుడ్ ఫుడ్.. మేలు చేసే వెల్లుల్లి

Update: 2024-04-27 06:30 GMT

తల్లి చేసే మేలు వెల్లుల్లి చేస్తుందంటారు. ఈ విషయాన్ని వైద్య శాస్త్రం ఎప్పుడో గుర్తించింది. అందుకే వెల్లుల్లిని ఆహారంలో తప్పనిసరిగా ఒక భాగం చేయమని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఈ వెల్లుల్లిని ఎలా తినాలో కూడా వారు చెబుతున్నారు.

ఖాళీ కడుపుతో: ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తింటే కొలస్ట్రాల్‌ విలువలు తగ్గుతాయి. గుండెకు కూడా మంచిది. పచ్చి వెల్లుల్లిలో ఎలిసిన్‌ అనే ఒక కాంపౌండ్‌ ఉంటుంది. దీనికి కొలస్ట్రాల్‌ను నియంత్రించే శక్తి ఉంది. అందువల్ల ఉదయం లేచిన వెంటనే కొన్ని పచ్చి వెల్లుల్లి రెబ్బలను తిని నీళ్లు తాగమంటారు. కొందరికి వెల్లుల్లి వాసన పడదు. అలాంటి వారు నిమ్మకాయ నీళ్లు కూడా తాగవచ్చు.

ఉదయాన్నే తేనెతో: ఉదయాన్నే తేనెతో వెల్లుల్లిని తింటే అనేక ప్రయోజనాలు ఉంటాయి. రెండు వెల్లుల్లి రెబ్బలను చిదిమి తేనెలో నానపెట్టాలి. ఇలా నానబెట్టిన రెబ్బలను ఉదయాన్నే తింటే– గ్యాసు సమస్యలు తీరిపోతాయి. వీటిని తినలేకపోతే– కొద్దిగా గోరువెచ్చని నీటిని తాగించాలి.

వెల్లుల్లి నూనె: ఈ మధ్యకాలంలో వెల్లుల్లి నూనె లభ్యమవుతోంది. ప్రతి రోజు వెల్లుల్లిని తినలేనివారు– వెల్లుల్లి నూనెతో చేసిన వంటలు తినటం మంచిది.

Tags:    

Similar News