Good Sleep Benefits : రాత్రి పూట పని చేస్తే నిద్రపట్టదు.. జాగ్రత్త

Update: 2024-07-01 07:36 GMT

సరైన నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. లేకుంటే రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రతి ఒక్కరికి నిద్ర అనేది తప్పనిసరి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నిద్ర అంటూ ఉండదు.

నిద్రలేమి సమస్య ఉంటే అనారోగ్య సమస్యలు దరి చేరుతుంటాయి. గాఢమైన, ప్రశాంతమైన నిద్రను పొందడం ఈ రోజుల్లో విలాస వంతమైన విషయం. బిజీ లైఫ్, వేగవంతమైన జీవనశైలి, దిగజారుతున్న ఆహారపు అలవాట్లు, ఇవన్నీ మన నిద్రపై చెడు ప్రభావాన్ని చూపుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రిపూట నిద్ర పట్టడం లేదనే ఫిర్యాదులను మనం తరచుగా వింటుంటాం. మీకు రాత్రి మంచి నిద్ర కావాలంటే పడుకునే ముందు కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి. ఆహారం తిన్న వెంటనే నిద్రపోవడం చాలా మందికి అలవాటు. మంచి నిద్ర కోసం, తిన్న తర్వాత కనీసం 30 నిమిషాల తర్వాత నిద్రపోవాలని గుర్తుంచుకోండి. దీనితో పాటు మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రజలు పడుకున్న తర్వాత కూడా ఎక్కువసేపు మొబైల్ స్క్రీన్ కు అతుక్కు పోతారు. దీని కారణంగా వారు నిద్రను కోల్పోతారు. అలాగే ఆలస్యంగా మేల్కొనరు. పడుకునే అరగంట ముందు మొబైలు దూరంగా ఉండండి. ఇవి ట్రై చేసి చూడండి.

Tags:    

Similar News