IPL 2024 : ఢిల్లీపై గెలుపు... రికార్డు సృష్టించిన ఆర్సీబీ

Update: 2024-05-13 07:53 GMT

ఐపీఎల్2024లో వరుసగా 5 మ్యాచులు గెలిచిన జట్టుగా ఆర్బీబీ రికార్డు సృష్టించింది. నిన్న ఢిల్లీపై 47 రన్స్ తేడాతో గెలవడంతో ఈ ఘనతను సాధించింది. తొలి 8 మ్యాచుల్లో ఒకటే విజయం సాధించిన బెంగళూరు, ఆ తర్వాత జరిగిన 5 మ్యాచుల్లోనూ గెలుపొందింది. గుజరాత్ టైటాన్స్ (2 సార్లు), హైదరాబాద్, పంజాబ్, ఢిల్లీ జట్లను చిత్తుచేసింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈనెల 18న చెన్నైతో కీలక పోరులో తలపడనుంది.

అయితే ఈ మ్యాచులు ‘ఫిక్సింగ్’ అని నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఢిల్లీతో మ్యాచులో ఆర్సీబీ ఫిక్సింగ్ చేసిందని చెన్నై ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. అందుకే ఢిల్లీ ప్లేయర్లు క్యాచులు వదిలేశారని అంటున్నారు. మరోవైపు సీఎస్కేతో మ్యాచులో రాజస్థాన్ స్లోగా ఆడి ఫిక్సింగ్ చేసిందని ఆర్సీబీ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో ఆర్సీబీ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. 188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ 140 పరుగులకే ఆలౌటైంది. ఢిల్లీ బ్యాటర్లలో అక్షర్(57), హోప్(29) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో యశ్ 3, ఫెర్గూసన్ 2, స్వప్నిల్, సిరాజ్, గ్రీన్ తలో వికెట్ తీశారు. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉన్నాయి.

Tags:    

Similar News