Reduce Stress : సింపుల్ టిప్స్ పాటిద్దాం.. ఒత్తిడిని చిత్తు చేద్దాం!

Update: 2024-04-29 09:42 GMT

ఒత్తిడిని అదుపు చేయకపోతే ఆందోళన, నిద్రలేమి లాంటి సమస్యలు తప్పవు. చేయాల్సిన పనుల్ని ప్రాధాన్యతాక్రమంలో పెట్టుకోలేక కొందరు, చిన్న పనికి కూడా ఎక్కువగా ఆదుర్దాపడేవాళ్లు తేలికగా ఒత్తిడికి లోనవుతూ ఉంటారు. మీరూ ఆ కోవలోకి వస్తే ఇవిగో ఈ కింది చిట్కాలు పాటించి మానసిక సాంత్వనను సొంతం చేసుకోండి.

* 10 – 15 నిమిషాల వ్యవధితో కూడిన పవర్‌ న్యాప్‌ (చిన్న కునుకు) తీయాలి.

* కొత్త అభిరుచిని అలవరుచుకోవాలి. సంగీత వాద్యం లేదా భాష నేర్చుకోవటం లాంటివన్నమాట!

* గ్రీన్‌ టీ తాగినా ఫలితం ఉంటుంది.

* ఇల్లు లేదా ఆఫీసులో మీ డెస్క్‌ సర్దటం లాంటి పనుల వల్ల కూడా ఒత్తిడి తగ్గుతుంది.

* రోజుకి కనీసం 20 నిమిషాలు జాగింగ్‌ చేస్తే ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి ఒత్తిడి తగ్గుతుంది.

* అప్పుడప్పుడూ విహారయాత్రలకు వెళ్తూ ఉండండి.

* పెంపుడు జంతువుల వల్ల ఒత్తిడి మటుమాయమవుతుంది. ఆ ప్రయత్నమూ చేయొచ్చు.

* యోగా, ధ్యానం లాంటి వ్యాయామాలతో మనసు ప్రశాంతంగా మారుతుంది.

Tags:    

Similar News