Brain Eating Amoeba : బ్రెయిన్ ఈటింగ్ అమీబా అంటే ఏంటీ ?

Update: 2024-05-23 05:36 GMT

బ్రెయిన్ ఈటింగ్ అమీబా తో కేరళలో ఓ బాలిక చనిపోయింది. ఈ నెల 1, 10వ తేదీల్లో కుటుంబ సభ్యులతో కలిసి బాలిక చెరువులో స్నానానికి వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత అస్వస్థతకు గురై మృతిచెందింది. ఆమె శరీరంలోకి ఫ్రీ లివింగ్ అమీబా ముక్కుగుండా ప్రవేశించి, మెదడుపై తీవ్ర ప్రభావం చూపినట్లు వైద్యులు తెలిపారు. ఈ వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం, వైద్య చికిత్స ఆలస్యమవడం వల్లే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు.

ఆ నీటిలో ఉన్న ఫ్రీ లివింగ్‌ అమీబా ఆమె ముక్కుగుండా శరీరంలోకి వెళ్లి మెదడుపై తీవ్ర ప్రభావం చూపించినట్టు వైద్యులు గుర్తించారు. వ్యాధిని సకాలంలో కుటుంబసభ్యులు గుర్తించకపోవడం, వైద్య చికిత్స అందించడంలో అప్పటికే ఆలస్యం జరుగడంతో బాలిక మరణించినట్టు వెల్లడించారు.

బ్యాక్టీరియా వర్గానికి చెందిన ఒక రకమైన అమీబాతో ఈ వ్యాధి వస్తుంది. కలుషితమైన నీటిలో ఉండే ఈ జీవి నోరు/ముక్కు ద్వారా శరీరంలోకి ప్రవేశించి, మెదడును పనిచేయకుండా చేస్తుంది. అందుకే దీనిని మెదడును తినే అమీబాగా పిలుస్తారు. ఈ వ్యాధి బారిన పడ్డ వారిలో తొలుత తీవ్ర జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కేరళలో 2017, 2023లోనూ ఈ కేసులు వెలుగుచూశాయి.

Tags:    

Similar News