మోదీ గారు మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు?
అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె అనిషా.. మోదీని కలవాలని ఈమెయిల్ చేసింది. ఇందుకు ప్రధాని స్పందించారు.;
తనను కలవాలని మెయిల్ పంపిన చిన్నారి అనిషా కోరికను ప్రధాని మోదీ నెరవేర్చాడు. అహ్మద్‌నగర్ ఎంపీ సుజయ్ విఖే పాటిల్ కుమార్తె అనిషా.. మోదీని కలవాలని ఈమెయిల్ చేసింది. ఇందుకు స్పందించిన ప్రధాని.. అనిషా మెయిల్‌కు 'దౌడ్ కె చలే ఆవో బెటా అంటూ' అంటూ సమాధానమిచ్చారు. ప్రధాని కార్యాలయం పిలుపుతో పార్లమెంట్‌కి వెళ్లిన అనిషా ఫ్యామిలీ.. ప్రధాని మోదీతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలిక ప్రధానికి వరుస ప్రశ్నలను సంధించగా.. ఆయన ఓపికగా సమాధానమిచ్చారు. చివరకు మీరు గుజరాత్ నుంచి వచ్చారు కదా.. మరి మీరెప్పుడు రాష్ట్రపతి అవుతారు అని ప్రశ్నించగా మోదీ ఏం సమాధానం చెప్పాలో తెలియని కాస్సేపు అలాగే నవ్వుతూ ఉండిపోయారు. వీరి సంభాషణ దాదాపు 10 నిమిషాల పాటు కొనసాగింది.