India corona : మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..!
India corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు చూశాయి.;
India corona : దేశవ్యాప్తంగా మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 15,69,449 కరోనా పరీక్షలు నిర్వహించగా కొత్తగా 1,72,433 కేసులు వెలుగు చూశాయి. నిన్నటితో పోలిస్తే 10 వేల కేసులు అధికంగా పెరిగాయి. ఇక కరోనాతో మరో 1,008మంది మృతి చెందారు. ఇందులో కేరళలో 355 మంది మరణించారు. దీనితో మరణాల సంఖ్య 4,98,983కి చేరుకుంది. మరోవైపు కరోనా నుంచి 2,59,107 మంది కోలుకున్నారు. దీనితో మొత్తం రికవరీల సంఖ్య 3,97,70,414కి చేరుకుంది.కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 15,33,921యాక్టివ్ కేసులున్నాయి.