ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలను జూన్ తొలి వారంలో విడుదల చేసేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకినాడ జేఎన్టీయూ ఈఏపీ సెట్‌ను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. మొత్తం 3,39,139 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ప్రాథమిక కీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా మే 26వ తేదీతో పూర్తి అయ్యింది. దీంతో ఫలితాలను ప్రకటించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది. ఫలితాలతో పాటు కౌన్సెలింగ్ తేదీలనూ ఒకేసారి ప్రకటించనుందట. కాగా ఈఏపీసెట్‌లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.