ఏపీ ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. జనరల్ కేటగిరీలో 80శాతం, వొకేషనల్‌లో 78శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. పాసైన అభ్యర్థుల మార్కుల మెమోలను జులై 1 నుంచి వెబ్‌సైటులో అందుబాటులో ఉంచుతామని ప్రభుత్వం పేర్కొంది. ఇంటర్మిడియెట్ బోర్డు సప్లిమెంటరీ పరీక్షల జవాబు పత్రాలను తొలిసారి డిజిటల్ విధానంలో మూల్యాంకనం చేశారు.
https://resultsbie.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.40 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణులయ్యారు.