BOM Recruitment 2022: డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగాలు..

BOM Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 314 అప్రెంటీస్‌ పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ ప్రకటించింది.;

Update: 2022-12-15 05:20 GMT

BOM Recruitment 2022: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM) దేశవ్యాప్తంగా అప్రెంటీస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్ధులను నియమించాలని చూస్తోంది. అప్రెంటీస్ చట్టం 1961 ప్రకారం ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్ (MP), మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్, TN, UP మరియు WBలలో మొత్తం 314 ఖాళీల భర్తీకి గాను నోటిఫికేషన్ ప్రకటించింది.



ఆసక్తి గల గ్రాడ్యుయేట్ అభ్యర్ధులు 23 డిసెంబర్ 2022 లోపు అధికారిక వెబ్‌సైట్ bankofmaharashtra.inలో నమోదు చేసుకోవచ్చు.


ముఖ్యమైన తేదీలు



ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ - 13 డిసెంబర్ 2022


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ - 23 డిసెంబర్ 2022


ఖాళీల వివరాలు

స్థానం                     ఖాళీ వివరాలు

ఆంధ్రప్రదేశ్             10

చండీగఢ్                 2

ఛత్తీస్‌గఢ్                 2

ఢిల్లీ                         10

గోవా                         4

గుజరాత్                     6

కర్ణాటక                     8

మధ్యప్రదేశ్ (MP) 22

మహారాష్ట్ర 207

పంజాబ్ 5

రాజస్థాన్ 3

తమిళనాడు (TN) 10

ఉత్తర ప్రదేశ్ (UP) 20

పశ్చిమ బెంగాల్ (WB) 5

మొత్తం 314

అర్హతలు:

గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ.

వయో పరిమితి:

20 నుండి 28 సంవత్సరాలు

అప్రెంటిస్ స్టైపెండ్

రూ. 9000/- నెలకు

ఎలా దరఖాస్తు చేయాలి?

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి - bankofmaharashtra.in

'కెరీర్స్'పై క్లిక్ చేసి, ఆపై 'కరెంట్ ఓపెనింగ్స్'పై క్లిక్ చేయండి

ఇప్పుడు ఆన్‌లైన్ అప్లికేషన్'పై క్లిక్ చేయండి.

ఎంపికపై క్లిక్ చేయండి

దరఖాస్తును నమోదు చేయడానికి, 'కొత్త రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి' అనే ట్యాబ్‌ను ఎంచుకుని, మీ వివరాలను నమోదు చేయండి

వివరాలను జాగ్రత్తగా పూరించండి

మీ దరఖాస్తును సేవ్ చేయండి

దరఖాస్తు ఫారమ్ యొక్క ఇతర వివరాలను పూరించండి

వివరాలను వెరిఫై చేసి, 'కంప్లీట్ రిజిస్ట్రేషన్'పై క్లిక్ చేయండి

భవిష్యత్ అవసరాల దృష్ట్యా అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోండి

దరఖాస్తు రుసుము:

జనరల్/EWS/OBC - రూ. 150/-

SC/ST - రూ. 100/-

PWD - రుసుము లేదు

Tags:    

Similar News