గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రేపు ఉ.10.30 నుంచి 1 వరకు జరగనుంది. దీనికి TGPSC అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లు, పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాల వారీగా హెల్ప్ లైన్ నంబర్లను కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 897 కేంద్రాల్లో 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నారు.
గ్రూపు–1 ప్రిలిమ్స్ పరీక్షలను ఈ దశలో వాయిదా వేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 9న ఆదివారం జరగబోయే గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని గుర్తు చేసింది. జూన్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని అసిస్టెంట్ సెంట్రల్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్–1, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు స్క్రీనింగ్ పరీక్ష ఉన్నందున గ్రూప్–1 ప్రిలిమ్స్‌ను వాయిదా వేయాలంటూ రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎం.గణేశ్, హనుమకొండకు చెందిన భూక్యా భరత్ పిటిషన్లు దాఖలు చేయగా, వాటిని శుక్రవారం దీనిపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి, జస్టిస్ అలిశెట్టి లక్ష్మినారాయణతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది