AP Engineering Seats : ఏపీలో పెరగనున్న ఇంజినీరింగ్ సీట్లు

Update: 2024-05-25 04:43 GMT

ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితిపై ఉన్న సీలింగ్‌ను AICTE తొలగించింది. ఇప్పటివరకు ఒక్కో బ్రాంచిలో గరిష్ఠంగా 240 సీట్లు ఉండగా.. ఆ నిబంధన ఎత్తివేయడంతో చాలా కాలేజీలు అదనపు బ్రాంచిలకు అనుమతులు తీసుకుంటున్నాయి. మౌలికసదుపాయాలు, లెక్చరర్ల ఆధారంగా అదనపు సెక్షన్లను AICTE నేరుగా మంజూరు చేస్తోంది. దీంతో డిమాండ్ అధికంగా ఉండే CSE ఆ తర్వాత ECE, EEE సెక్షన్లలో ఇంజినీరింగ్ సీట్లు ఈ ఏడాది పెరగనున్నాయి.

రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం వరకు 56 వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో 8,440 ఎంబీబీఎస్‌ సీట్లు ఉన్నాయి. తాజాగా ఎనిమిది ప్రభుత్వ, రెండు ప్రైవేటు వైద్య కళాశాలలకు పూర్తి స్థాయిలో అనుమతులు లభిస్తే మరో 500 సీట్లు అదనంగా వస్తాయి. దీంతోపాటు తెలంగాణ ఏర్పాటై పదేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో విభజన చట్టం ప్రకారం కన్వీనర్‌ కోటా సీట్లు పూర్తిగా తెలంగాణ విద్యార్థులకు దక్కుతాయని వైద్యారోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి

మరోవైపు తెలంగాణలో ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 27 నుంచి మూడు విడతలుగా ప్రవేశాల ప్రక్రియ జరగనుంది. ఆ నెల 30 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించనున్నారు. జులై 12న మొదటి విడత ఇంజినీరింగ్ సీట్లను కేటాయిస్తారు. జులై 19 నుంచి రెండో విడత కౌన్సెలింగ్, 24 నుంచి రెండో విడత సీట్ల కేటాయింపు, జులై 30 నుంచి తుది విడత కౌన్సెలింగ్, ఆగస్టు 5న తుదివిడత సీట్లను కేటాయించనున్నారు.

Tags:    

Similar News