డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం గతనెల 24న నిర్వహించిన పాలిసెట్ పరీక్ష ఫలితాలు నేడు వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఫలితాలను రిలీజ్ చేస్తారు. ఈ పరీక్షకు 92,808 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోగా 82,809 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల కోసం https://sbtet.tela ngana.gov.in ని సంప్రదించవచ్చు. కాగా.. మే 24న పాలిసెట్ రాత పరీక్ష ప్రశాంతంగా జరిగింది. మొత్తం 49 పరీక్షా కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, విజయవాడ పట్టణాల్లో సైతం పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.