IT Sector : ఐటీలో ఫ్రెషర్స్‌కు పెరుగుతున్న డిమాండ్

Update: 2024-06-14 08:30 GMT

భారతదేశం లోని ఐటి కంపెనీలు, ముఖ్యంగా హార్డ్వేర్, సాఫ్ట్ వేర్ రంగాలలో ఫ్రెషర్స్ కు డిమాండ్ పెరుగుతోంది. గత ఆరు నెలల్లో యువ ప్రతిభకు డిమాండ్ 5 శాతం పెరిగింది. చాలా కంపెనీలు ఫ్రెషర్స్ ను నియమించుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గురువారం ఓ నివేదిక వెల్లడించింది.

టాలెంట్ ప్లాట్ ఫాం ఫౌండిట్ నివేదిక ప్రకారం, సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ పరిశ్రమలలో కొత్త గ్రాడ్యుయేట్లు అత్యధిక జీతాల ప్యాకేజీలను పొందుతున్నారు. సగటున సంవత్సరానికి రూ. 4.07 లక్షల నుండి రూ. 7.49 లక్షల వరకు వేతన ఆఫర్లు లభిస్తున్నాయి. దీని తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ పరిశ్రమలో ఫ్రెషర్లకు డిమాండ్ ఉంది. ఇక్కడ సగటు జీతాలు రూ. రూ.3.06 లక్షల నుంచి రూ. 5.49లక్షలు ఆఫర్ చేస్తున్నారు.

ఈ రంగాలతోపాటు దీటుగా వేతనాలు ప్రకటిస్తున్న ఇతర పరిశ్రమల జాబితాలో ఆటోమోటివ్, ఇంజనీరింగ్, ఎఫ్ఎంసీజీ, ఆహారం, ప్యాకేజ్డ్ ఫుడ్ పరిశ్రమ ఉన్నాయి. వీటిలో సగటు జీతాలు రూ.3.11లక్షల నుంచి రూ.5.38లక్షల వరకు ఉన్నాయి. నివేదిక ప్రకారం, అత్యధిక సగటు ఫ్రెషర్ జీతం రూ.4.16లక్షలతో బెంగుళూరు ముందు పరుసలో నిలుస్తున్నది. రూ.3.99 లక్షలతో ముంబై, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఢిల్లీ, బెంగళూరులోని ఐటీ కంపెనీలు ఫ్రెషర్లకు అత్యధిక డిమాండ్ ను చూపించగా, ముంబై, చెన్నై, పూణే తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

Tags:    

Similar News