Former Miss Kerala: రోడ్డు ప్రమాదంలో మాజీ మిస్ కేరళ మృతి..!
Former Miss Kerala: కేరళలో విషాదం చోటుచేసుకుంది. మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.;
Former Miss Kerala: కేరళలో విషాదం చోటుచేసుకుంది. మాజీ మిస్ కేరళ అన్సీ కబీర్(25), రన్నరప్ అంజనా షాజన్(26) ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఎర్నాకుళం బైపాస్‌లో రాత్రి ఒంటిగంటకు ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి కారు అదుపుతప్పినట్లుగా సమాచారం.. జరిగిన ఈ ప్రమాదంలో వీరిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రయాణానికి కాసేపటి ముందే అన్సీ..తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా 'ఇట్స్ టైమ్ టు గో'అంటూ ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. వీరి మృతదేహాలను ఈఎంసీలో ఉంచారు. కాగా ఆగస్ట్‌లో పెగాసస్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహించిన అందాల పోటీలో వీరు పాల్గొనగా అందులో అన్సీ కబీర్ విజేతగా నిలవగా, అంజనా షాజన్ రన్నరప్ గా నిలిచింది. అక్కడే పరిచయం ఏర్పడగా ఇద్దరు మంచి స్నేహితులుగా మారారు.