Inspector Rishi : 'ఇన్ స్పెక్టర్ రిషి'.. కొత్త వెబ్ సిరీస్ రివ్యూ

Update: 2024-04-10 06:46 GMT

అమెజాన్ ప్రైమ్ లో 'ఇన్ స్పెక్టర్ రిషి' (Inspector Rishi) వెబ్ సిరీస్ ఆకట్టుకుంటోంది. నవీన్ చంద్ర ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సిరిస్ ఇది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కు మిస్టరీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్ తో పాటు హారర్ టచ్ ఇస్తూ సాగిందిది.

తమిళనాడులోని తేన్ కాడ్ అడవిలో జరిగే కథ ఇది. అడవి చుట్టూ జరుగుతున్నసాలేగూడు హత్యలు వెనుక నిజంగానే అతీంద్రీయ శక్తులు ఉన్నాయా? అనేదాని చుట్టూ బిగుతైన స్క్రీన్ ప్లే తో ఈ కథ నడుస్తుంది. జోనర్, తగిన యాంబియాన్స్ విషయంలో దర్శకురాలు నందిని మంచి పనితీరు కనబరిచింది. ఎపిసోడ్ చివరి పది నిమిషాల్లో వచ్చే సన్నివేశాలు తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠని రేపాయి.

హారర్ ని ఇష్టపడే ప్రేక్షకులని ఆకట్టుకునే సీన్స్ చాలా ఉన్నాయి. నవీన్ చంద్ర నటన బాగుంది. ఫారెస్ట్ అధికారి సత్యగా చేసిన శ్రీకృష్ణ దయాళ్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు. సునైనా చాలా సహజంగా కనిపించింది. వెబ్ సిరీస్ లో 40 నిమిషాల పాటు సాగేలా మొత్తం 10 ఎపిసోడ్స్ ఉన్నాయి

Tags:    

Similar News