ఈసారి లోక్‌సభలో మెజారిటీ సభ్యులు కొత్తవారే కనిపించనున్నారు. తాజా ఎన్నికల్లో ఏకంగా 280 మంది తొలిసారి ఎంపీలుగా గెలిచారు. ఉత్తరప్రదేశ్ నుంచి 45, మహారాష్ట్ర నుంచి 33 మంది గరిష్ఠంగా ఎన్నికయ్యారు. కొత్తగా లోక్‌సభలో అడుగుపెట్టే వారిలో మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్, బొమ్మై, మనోహర్ లాల్ వంటి వారితోపాటు సినీనటులు కంగనా, సురేశ్ గోపి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి 10, ఎపీ నుంచి 13 మంది కొత్తవారున్నారు. రాజ కుటుంబాలకు చెందిన ఛత్రపతి సాహు, యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్, కృతీ దేవితోపాటు కోల్‌కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. తొలిసారిగా లోక్‌సభకు వస్తున్న సినీ నటుల్లో సురేశ్ గోపి, కంగనా రనౌత్ ఉన్నారు. రాజ్యసభ సభ్యుల్లో అనిల్‌దేశాయ్, భూపేంద్ర యాదవ్, ధర్మేంద్రప్రధాన్, మాండవీయ, పురుషోత్తం రూపాలా లోక్‌సభకు వస్తున్నారు.