చత్తీస్గఢ్లో పెద్దఎత్తున మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపో యారు. నారాయణపూర్, సుక్మా, బీజాపూర్, కాంకేర్ జిల్లాల్లో కలిపి మొత్తం 51 మంది ఆయుధాలు వీడారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో మావోయిస్టు కార్యకలాపాలు పూర్తిగా తగ్గుతున్నవని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్లలో 185 మంది హతమయ్యారని చెప్పారు.లొంగిపోయిన వారిలో చాలా మంది గతంలో పలు విధ్వంసకర ఘటనల్లో పాల్గొన్నట్లు పోలీసులు తెలిపారు. 2024 నుంచి ఇప్పటివరకు బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 185 మంది మావోయిస్టులు హతమయ్యారని, 803 మంది అరెస్టయి, 431 మంది లొంగిపోయారని అధికారులు పేర్కొన్నారు.