ఓటరు చైతన్యం మరోసారి కనిపించింది. ఐతే.. ఈ చైతన్యం దేనికీ కూడా ఉపయోగపడనిది. 2024 లోక్ సభ ఎన్నికల్లో నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ)కు 63,72,220 ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. అత్యధికంగా బీహార్ రాష్ట్రంలో 8,97, 323 ఓట్లు నోటాకు పడినట్లు పేర్కొన్నారు.
ఉత్తరప్రదేశ్లో 6,34,971 ఓట్లు, మధ్య ప్రదేశ్లో 5,32,667 ఓట్లు, పశ్చిమ బెంగాల్లో 5,22,724 ఓట్లు, తమిళనాడులో 4,61,327 ఓట్లు, గుజరాత్ 4,49,252 ఓట్లు, మహారాష్ట్రలో 4,12,815 ఓట్లు,
ఆంధ్రప్రదేశ్లో 3,98,777 ఓట్లు, ఒడిశాలో 3,24, 588 ఓట్లు నోటాకు పోలయ్యాయి.
2019 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు 65,22,772. ఈ ఎన్నికల్లో ఆ సంఖ్య రెండు లక్షలకు తగ్గింది. ఆ ఎన్నికల్లోనూ బీహార్ లోనే అత్యధికంగా 8,16,950 ఓట్లు నోటాకు పోలయ్యాయి.