ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి సీబీఐ కేసులో ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ నెల 23న తదుపరి విచారణ చేపడతామని వెల్లడించింది. ఈలోగా కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంపై సీబీఐ అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. మద్యం విధానానికి సంబంధించి జూన్ చివర్లో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఆయన సీబీఐ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఈ అరెస్టును సవాల్ చేస్తూ తొలుత దిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ ఊరట లభించలేదు. అరెస్టు చట్టబద్ధమేనంటూ ఉన్నత న్యాయస్థానం సమర్థించింది. దీన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.