ఢిల్లీలోని (Delhi) కబీర్ నగర్‌లో మార్చి 21న తెల్లవారుజామున రెండంతస్తుల భవనం కుప్పకూలడంతో ఇద్దరు మృతి చెందగా, ఒకరు గాయపడ్డారు. రెస్క్యూ సేవలకు తెల్లవారుజామున 2.16 గంటలకు పాత నిర్మాణ భవనం కూలిపోయిందని కాల్ వచ్చింది. శిథిలాల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు. వారందరినీ బయటకు తీసి ఆసుపత్రికి తరలించగా, ఇద్దరు అక్కడికి చేరుకునేలోపే మృతి చెందారు. మూడో కార్మికుడు చికిత్స పొందుతుండగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
మృతులు అర్షద్, 30, తౌహిద్, 20. గాయపడిన వ్యక్తిని రెహాన్ (22)గా గుర్తించారు. భవనం యజమాని షాహిద్‌గా గుర్తించామని, అతడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ విషయంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.