అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నుంచి వచ్చిన ఇన్చార్జీలు నియోజకవర్గాన్ని వదిలి పెట్టవద్దని జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్, స్టార్ క్యాంపెనర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో ఏర్పాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలు, జార్ఖండ్ పీసీసీ నేతలు, అసెంబ్లీ నియోజ కవర్గ ఇన్చార్జిల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఎన్నికల సందర్భంగా జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సేవ చేసే అవకాశం కల్పించినందుకు సమావేశానికి హాజరైన ఎఐసిసి జనరల్ సెక్రెటరీ కెసి వేణుగోపాల్ తోపాటు ఏఐసిసి పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. సమావేశానికి హాజరైన నేతలు అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. జార్ఖండ్ రాష్ట్ర ఎన్నికల్లో సీనియర్ పరిశీలకుడిగా బాధ్యతలు నిర్వహి స్తూనే మరోవైపు రామ్ గడ్, బొకోరో అసెంబ్లీ నియోజక వర్గాల బాధ్యతలు సైతం తాను తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి రాగానే జార్ఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతలు, రాష్ట్రంలోని 90 శాతం కాంగ్రెస్ సీనియర్ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్టు తెలిపారు.