Vice President : ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

Update: 2025-09-12 05:45 GMT

భారత నూతన ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఈ నెల 9న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్ష ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి ఆయన రాజీనామా చేశారు. దీంతో మహారాష్ట్ర గవర్నర్‌గా గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు.

Tags:    

Similar News