CPI Leader : సీపీఐ సీనియర్ లీడర్ కన్నుమూత

Update: 2024-05-03 07:27 GMT

సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ క్యాన్సర్‌తో మృతి చెందారు. కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆయన సేవలను స్మరించుకుంటోంది. లాల్ సలామ్ చెబుతోంది.

పార్టీ జాతీయ కార్యదర్శి అతుల్ కుమార్ అంజన్ క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 70 ఏళ్లు. గత నెల రోజులుగా ఆయన లక్నోలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతుల్ అంజన్ తన రాజకీయ ప్రయాణాన్ని 1977లో ప్రారంభించారు.

లక్నో యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మొదటి వ్యక్తి అతుల్ అంజన్. అతను అత్యంత ప్రతిభావంతుడు మాత్రమే కాదు చురుకైన కమ్యూనిస్ట్ నాయకులలో ఒకడు. సామాజిక కార్యకర్తగా కూడా సమాజంలో తనదైన ముద్ర వేశారు. రైతులు, కార్మికుల ప్రయోజనాల కోసం ఎంతో కృషి చేసి సమాజంలో గౌరవాన్ని పొందారు. రాజకీయాల్లో నిన్నటితరం నేతల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.

Tags:    

Similar News