Hindu Population : ఇండియాలో తగ్గుతున్న హిందూ జనాభా

Update: 2024-05-10 09:16 GMT

భారతదేశంలో హిందువుల జనాభా 65 ఏళ్లలో 7.81 శాతం తగ్గిందని.. మైనారిటీల జనాభా పెరిగిందని ఇఐసి-పిఎం నివేదికలో వెల్లడైంది. భారతదేశంలో మెజారిటీగా ఉన్న హిందూ మతం జనాభా గణనీయంగా తగ్గింది. 1960 నుంచి 2015 మధ్య కాలంలో దేశంలో హిందువుల జనాభా వాటా 7.81 శాతం తగ్గినట్లు ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి(ఇఎసిసిఎం) తన నివేదికలో వెల్లడించింది.

ఒకపక్క దేశంలో హిందువుల జనాభా తగ్గిపోగా మరోపక్క బౌద్ధులు, సిక్కులు, ముస్లింలు, క్రైస్తవులతో సహా మైనారిటీల జనాభా పెరిగింది. అయితే పార్శీలు, జైనుల జనాభాలో మాత్రం తగ్గుదల కనిపించింది. ఇతర పొరుగు దేశాలలో మెజారిటీ మతస్తుల జనాభా పెరుగుదల ఉండగా భారత్లో మాత్రం భిన్నంగా ఉంది.

1950లో భారత జనాభాలో హిందువుల వాటా 84.68 శాతం ఉండగా 2015 నాటికి అది 78.06 శాతానికి తగ్గింది. ముస్లింల జనాభా మాత్రం 1950లో 9.84 శాతం ఉండగా 2015 నాటికి ఇది 14.09 శాతానికీ చేరుకున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. హిందువుల జనాభా పొరుగుదేశమైన మయన్మార్లో 10 శాతం తగ్గగా నేపాల్లో అధిక సంఖ్యాక మతమైన హిందూ జనాభాలో 3.6 శాతం తగ్గుదల ఉందని నివేదిక తెలిపింది.

Tags:    

Similar News