Polling Team : పోలింగ్ టీమ్ డెడికేషన్.. ఒక్క ఓటు కోసం అడవులు దాటారు

Update: 2024-04-20 07:53 GMT

భారతదేశంలోనే సుదీర్ఘ ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడత పోలింగ్ ముగిసింది. పోలింగ్ టీమ్ ఎక్కువ పోలింగ్ పర్సెంటేజీ సాధించేందుకు ఎక్కే కొండ.. దిగే లోయ అన్నట్టుగా పరిస్థితి ఉంది. కొత్త ఓటర్లను కూడా ప్రజాస్వామ్య యుద్ధంలో భాగం చేసేందుకు ఎన్నికల సంఘం తమవంతు కసరత్తు చేస్తోంది.

కేరళలోని ఇడుక్కి జిల్లాలో ఒక్క ఓటరు కోసం పోలింగ్ టీమ్ బాగా కష్టపడింది. పోలింగ్ టీమ్ డెడికేషన్ ఏంటో ఈ సంఘటనతో మరోసారి ప్రూవ్ అయింది. పోలింగ్ సిబ్బంది 18 కిలోమీటర్లు అటవీప్రాంతంలో ప్రయాణించారు. ఎడమలక్కుడి అనే కుగ్రామానికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు సహా 9 మంది సిబ్బంది వీలైనంత దూరం జీపులో వెళ్లారు.

ఓట్ ఫ్రమ్ హోమ్ అప్లికేషన్ పెట్టుకున్న వారిని ఈసీ టీమ్ కలుస్తోంది. మధ్యలో కాలినడకన సెలయేరు, కొండ దారులు దాటుతూ ఆ గ్రామంలో నివసించే 92 ఏళ్ల శివలింగం అనే ఓటరును కలిశారు. వయసు మీదపడి మంచానికి పరిమితమైన శివలింగానికి ఓటు వేయాలనే సంకల్పం బలంగా ఉండటంతో ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. శివలింగం ఇంట్లో మంచం పక్కనే పోలింగ్ బూత్ ను పెట్టారు. ఆయన తన మనవడి సాయంతో ఓటు వేశారు. ఇంత కష్టపడి తన ఓటు కోసం వచ్చారా అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆ వృద్ధ ఓటరు.

Tags:    

Similar News