పటాకుల తయారీ.. అమ్మకాలపై ఢిల్లీ సర్కారు బ్యాన్

Update: 2024-09-11 05:00 GMT

రాబోయే వింటర్ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలో కాలుష్య నియంత్రణే లక్ష్యంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 వరకు అమలులో ఉంటుందని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్‌ రాయ్‌ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో క్రాకర్స్ అమ్మకం, డెలివరీలకూ ఈ నిషేధం వర్తిస్తుందని తెలిపారు. ఈ నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు ఢిల్లీ పోలీస్‌, పొల్యూషన్ కంట్రోల్ కమిటీ, రెవెన్యూశాఖల కో ఆర్డినేషన్ తో యాక్షన్ ప్లాన్ రెడీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ ను కంట్రోల్ చేయడమే లక్ష్యంగా నిర్దేశించుకున్న 21 ఫోకస్‌ పాయింట్ల ఆధారంగా పటాకుల తయారీ, అమ్మకాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Tags:    

Similar News