Maharashtra CM : మహారాష్ట్ర 21వ సీఎం ఫడ్నవీస్.. నేటి సాయంత్రం ప్రమాణ స్వీకారం

Update: 2024-12-05 10:30 GMT

మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మహాయుతి కూటమి అధికారంలోకి వచ్చిన 11 రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడింది. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ప్రభుత్వం ఈ సాయంత్రం ముంబైలోని ఆజాద్ మైదాన్ లో కొలువుదీరనుంది. మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం దేవేంద్ర ఫడ్నవీస్ కు ఇది మూడోసారి.

మహారాష్ట్రకు ఆయన 21వ సీఎం కావడం విశేషం. డిప్యూటీ సీఎం, కొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయనున్నారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో పాటు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు పాల్గొంటారు. ఏక్ నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా, అజిత్ పవార్ కు దక్కే పదవి ఏంటి అన్నది అత్యంత ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News