Puja Khedkar : దుబాయ్ పారిపోయిన పూజా ఖేడ్కర్?

Update: 2024-08-02 10:30 GMT

మాజీ ప్రొబేషనరీ IAS పూజా ఖేడ్కర్ దుబాయ్ పారిపోయినట్లు తెలుస్తోంది. ఆమె ముందస్తు బెయిల్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది. దీంతో తన అరెస్ట్ తప్పదని భావించి ఆమె దుబాయ్ పరారైనట్లు సమాచారం. కొద్ది రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడం, సెల్ ఫోన్ కూడా స్విచ్ఛాఫ్‌లో ఉండడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇప్పటికే ఆయుధాల దుర్వినియోగం కేసులో ఆమె తల్లి మనోరమను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.

జులై 31న అభ్యర్థిత్వాన్ని యూపీఎస్సీ నిర్ణయం ప్రకటించిన నాటి నుంచి ఆమె ఫోన్‌ స్విచ్చాఫ్‌ వస్తోంది. అంతకు ముందు ముస్సోరీలోని అకాడమీ ఎదుటా హాజరై ఆమె తన వివరణ ఇచ్చుకోలేదు. దీంతో యూపీఎస్సీ ఆమెకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. అయితే.. నోటీసులకు స్పందించేందుకు ఆగష్టు 4వ తేదీ వరకు ఆమె గడువు కోరారు. కానీ, యూపీఎస్సీ మాత్రం జులై 30 దాకా అవకాశం ఇచ్చింది. అయినా ఆమె గైర్హాజరయ్యారు.

దీంతో ఆమె దుబాయ్‌కి వెళ్లిపోయి ఉండొచ్చని జాతీయ మీడియా కథనాలు ఇస్తోంది. దీనిపై పూజా తరఫు స్పందన రావాల్సి ఉంది. మరోవైపు.. పుణే పోలీసులు సైతం ఆమె పరారైన విషయాన్ని ధృవీకరించాల్సి ఉంది.

Tags:    

Similar News