Ayodhya : 5 శతాబ్దాల తర్వాత అయోధ్యలో నవమి.. మోదీ, యోగీ ఎమోషనల్

Update: 2024-04-17 06:43 GMT

దేశమంతా శ్రీరామనవమిని కన్నుల పండువగా జరుపుకుంటోంది. రాములోరి ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. శ్రీరాముడు-సీతా పరిణయ వేడుకను కళ్లారా చూసి పులకించిపోతున్నారు భక్తజనం. రామ జన్మభూమి అయోధ్యలో అయితే రాముడే కొలువయ్యాడా అన్నంతగా భక్తజనంలో పారవశ్యం అలుముకుంది.

దాదాపు 550 ఏళ్ల తర్వాత మొదటిసారి 2024 ఏప్రిల్ 17న శ్రీరాముడు తన జన్మస్థలమైన అయోధ్యలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో.. యావద్భారతావని పులకించిపోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు, సీనియర్లు అందరూ దేశప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మర్యాద పురుషోత్తమ భగవానుడు శ్రీరాముడి జీవితం, అతని ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన పునాదిగా మారుతాయని మోదీ పూర్తి నమ్మకం వ్యక్తంచేశారు. అయోధ్యలోని గొప్ప, దివ్యమైన రామ మందిరంలో మన రామ్ లాలా కూర్చున్న మొదటి రామ నవమి ఇది.. 5 శతాబ్దాల నిరీక్షణ తర్వాత ఈరోజు అయోధ్యలో రామనవమిని ఈ విధంగా జరుపుకునే భాగ్యం లభించింది..ఇది దేశప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితమన్నారు ప్రధాని మోదీ.

శతాబ్దాల నిరీక్షణ తర్వాత అయోధ్య ధామ్‌లో నిర్మించిన కొత్త, గొప్ప, దివ్యమైన శ్రీ రామ్‌లాలా ఆలయం లక్షలాది మంది రామభక్తులను, మానవ నాగరికతను సంతోషంగా మరియు గర్వించేలా చేస్తోందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రామ నవమి సందర్భంగా అన్నారు. జై శ్రీ రామ్! అందరికీ పవిత్రమైన రామ నవమి పండుగ శుభాకాంక్షలంటూ అమిత్ షా సహా.. ప్రముఖులు ట్వీట్లు చేశారు.

Tags:    

Similar News