నిర్మాణంలో ఉన్న వంతెన ఒకరి ప్రాణాలను బలిగొంది. బీహార్‌లోని సుపాల్‌లోని భేజా-బకౌర్ మధ్య మరీచా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక భాగం కూలిపోవడంతో ఒక వ్యక్తి మరణించారు. మరో తొమ్మిది మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. "భేజా-బకౌర్ మధ్య మరీచా సమీపంలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒకరు మరణించారు, తొమ్మిది మంది గాయపడ్డారు" అని సుపాల్ డీఎమ్ కౌశల్ కుమార్ తెలిపారు.