Heavy Rains : పలు రాష్ట్రాల్లో కుండపోత బీభత్సం

Update: 2024-08-02 09:18 GMT

భారతదేశంలో రుతుపవన అల్లకల్లోలం కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షాలతో ఏడు రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. వర్షాలకు సంబంధించిన సంఘటనలలో 32 మంది మరణించారు. ఢిల్లీ-ఎన్ సీఆర్ రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. ఒకేరోజు 108 మిల్లీ మీటర్ల వాన కురిసింది.

ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో క్లౌడ్ బరస్ట్ వల్ల కుంభవృష్టి కురిసింది. వరదలు పోటెత్తాయి. వేర్వేరు ఘటనల్లో 14 మంది మరణించారు. ఉత్తరాఖండ్లో 10 మంది, హిమాచల్ ప్రదేశ్లో నలుగురు, ఢిల్లీలో ఐదుగురు, ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో ఇద్దరు, హర్యానాలోని గురుగ్రామ్లో ముగ్గురు, రాజస్థాన్లోని జైపూర్లో ముగ్గురు, బీహార్లో ఐదుగురు మరణించారు. దీనితో, వర్షాలకు సంబంధించిన సంఘటనల కారణంగా దేశవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 300 మార్కును దాటేసింది.

కేరళలోని వాయనాడ్లో 291 మంది మరణించారు. మంగళవారం కేరళలోని వాయనాడ్లోని మెప్పాడి సమీపం లోని కొండ ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మూడు భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరా ఖండ్, రాజస్థాన్, బీహార్ తదితర రాష్ట్రాల్లో ఆగస్టు 7 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉత్తరాఖండ్, గోవా, కర్ణాటకలో వరద ముంచెత్తే అవకాశం ఉన్నందున రెడ్ అలర్ట్ సూచనలు చేసింది.

Tags:    

Similar News