Jammu : జమ్ములో స్కూళ్లకు సెలవులు

Update: 2025-05-09 10:30 GMT

జమ్ము కాశ్మీర్ లో స్కూళ్లు, విద్యాసంస్థలు, యూనివర్సిటీలు అన్నిటికీ సెలవులు ప్రకటించారు అధికారులు. పాకిస్తాన్ దాడులతో అప్రమత్తమైన ప్రభుత్వం.. ముందు జాగ్రత్తగా ఇవాళ, రేపు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది.

జమ్ములో పరిస్థితిని అక్కడి సీఎం ఒమర్ అబ్దుల్లా పరిశీలించారు. నిన్న రాత్రి జమ్ముపై డ్రోన్, మిసైల్ దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ విఫలమైంది. పాక్ మిసైల్లను భారత ఎయిర్ ఫోర్స్ నిలువరించింది. ఈ ఉదయం ఉధమ్ పూర్ వెళ్లిన ఒమర్ అబ్దుల్లా గ్రౌండ్ రియాలిటీ తెలుసుకున్నారు.

Tags:    

Similar News